Friday 5 September 2014

Shweta Basu Prasad Caught In A Prostitution Racket

Shweta Basu Prasad Caught In A Prostitution Racket

శ్వేతా బాబులకు ముచ్చెమటలు పడుతున్నాయా?

Shweta prasad caught in a prostitution racket

మొన్నటి వరకు శృంగార తార, సెక్సీ షకీలా తన జీవితకథను రాస్తుందని తెలిసి సౌత్ ఇండస్ట్రీ మొత్తం వణికిపోయింది. ఈ అమ్మడితో చాలా మంది పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు, రాజకీయ నాయకులు రాసలీలలు నడిపారని సౌత్ ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. అయితే తన జీవితకథలో తమ గురించి ఎక్కడ బయటపెడుతుందోనని భయపడిపోయారు. కానీ వారి పేర్లు మాత్రం చెప్పకుండా వాళ్లందరికి ఓ రెండు, మూడు నెలలు నిద్రల్లేని రాత్రులు గడిపేలా చేసేసింది షకీలా.

షకీలా సైలెంట్ అయ్యిందని అందరూ అనుకుంటే... ఆ స్థానాన్ని Shweta Basu Prasad ఆక్రమించేసింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది శ్వేతాబసు ప్రసాద్. శ్వేతా ఇటీవలే వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యభిచారంలో పట్టుబడ్డ తర్వాత శ్వేతా పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ అమ్మడితో సంబంధం వున్న బఢా బాబులకు ముచ్చెమటలు పట్టేలా చేస్తోంది.

శ్వేతా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస ఆఫర్లు రావాలంటే వ్యభిచారం చేస్తేనే సినిమా అవకాశాలు వస్తాయంటూ ఈ అమ్మడిని కొంతమంది వ్యభిచారం చేయమని ప్రోత్సహించారట. అంతే కాకుండా ఎన్ని స్టేజ్ షోలు చేసినా కూడా ఎవరికి దక్కని ఆఫర్లు వ్యభిచారం చేస్తేనే వస్తాయని ఈ అమ్మడిని ప్రోత్సాహించారని తెలిసింది. అయితే సినిమా తారల్లో ఇంకా చాలా మంది సినీ తారలు, అమ్మాయిలతో పాటుగా స్టార్ హీరోయిన్లు కూడా ఈ వ్యభిచార కూపంలో వున్నారని శ్వేతా తెలిపినట్లుగా సమాచారం.

అయితే ఆ స్టార్ హీరోయిన్, సినీతారలు ఎవరు? ఈ అమ్మడిని ప్రోత్సాహించిన ఆ దర్శక, నిర్మాతలు ఎవరు? అసలు శ్వేతా ఈ వ్యభిచార కూపంలోకి దిగడానికి గల కారణాలేంటో త్వరలోనే తెలియనున్నాయి. మరి ఈ వార్తలన్నీ కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై శ్వేతా అధికారికంగా మీడియా ముందుకొచ్చి ఎప్పుడు, ఏం చెప్పనుందోనని టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది.

No comments:

Post a Comment