Wednesday 10 September 2014

Is Samantha Quitting Telugu Films

Is Samantha Quitting Telugu Films

త్వరలో సమంత సినీ సన్యాసం తీసుకోనుందా ?

 
Is samantha quitting telugu films

‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన Samantha త్వరలో సినీ సన్యాసం తీసుకోబోతుందని వార్తలొస్తున్నాయి. ‘ఏమాయ చేసావే’ సినిమా తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’ సినిమాలతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో ఒకప్పుడు ‘గోల్డెన్ లెగ్’ అని పిలిచిన ఈ అమ్మడిని ప్రస్తుతం ‘ఐరెన్ లెగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ భామకు ఒళ్లుమండి ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసేసి, సినిమాలకు స్వస్తి చెప్పడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది.

యంగ్ హీరోలనుంచి సీనియర్ల వరకు అందరితో జతకట్టడానికి ఆసక్తి చూపిన ఈ గ్లామర్ డాల్.. నాయికగా వున్నతస్థాయిలో వుండగానే నటనకు స్వస్తి పలుకుతానంటోంది. ఎందుకంటే.. మార్కెట్ లో తన వ్యాల్యూ పడిపోయిన తర్వాత పరిశ్రమకు గుడ్ బై చెబితే చెడ్డ పేరు వస్తుందని.. అందుకే మంచి నాయికగా వున్నతస్థాయిలో వున్నప్పుడే నటకు, పరిశ్రమకు స్వస్తి చెబుతానని క్లారిటీ ఇచ్చుకుంది. ఇందుకు గల మరిన్ని కారణాల కూడా వున్నాయి. ఈ అమ్మడి సొంత పరిశ్రమ అయిన కోలీవుడ్ లో ఇంతవరకు విజయం దక్కలేదు.

భారీ సినిమాల్లో నటించి, అందులో అందాలను ఒలకబోసినా.. ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఇటీవలే అంజాన్ సినిమాలో బికినీ వేసుకుని కనువిందు చేసినా.. ఆమెకు లాభం చేకూరలేదు. టాలీవుడ్ లోలాగే కోలీవుడ్ లో తన హవాను కొనసాగించుకోవాలని ఎంతప్రయత్నించినప్పటికీ.. ఈ అమ్మడికి ఒక్క విజయం కూడా అక్కడ దక్కడం లేదు. దీంతో తనకు కోలీవుడ్ లో ఎక్కడా చెడ్డపేరు వస్తుందేమోనని భయపడుతోంది సమంత!

ప్రస్తుతం పరిశ్రమకు ఎంతోమంది కొత్త కథానాయికలు వస్తున్నారు. అయితే వాళ్లందరూ కొన్ని వ్యక్తిగత, ప్రేమ వ్యవహారాలు, ఇతర కారణాల వల్ల కేవలం రెండుమూడు సినిమాలు మాత్రమే పరిమితమవుతున్నాయి. మరికొంతమంది తారలైతే ప్రేమవ్యవహారంలో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల గురించి స్పందించిన సమంత.. తాను కూడా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చిందని.. అయితే కొందరు తన శ్రేయస్సు కోరడంతో తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపింది.

చిత్రపరిశ్రమలో వచ్చే ప్రతిఒక్కరికి ధైర్యం చెప్పేవాళ్లు ఖచ్చితంగా వుండాలని.. అప్పుడే వాళ్లు ధైర్యంతో ముందడుగు వేయగలరని సమంత భావిస్తోంది. సమంత కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో వున్నప్పుడు సినిమాలకు దూరం అవ్వాలని భావించిన నేపథ్యంలో.. కొందరు తనలో ధైర్యాన్ని కూడగట్టారని తెలిపింది. దీంతో ఈ అమ్మడు మళ్లీ అటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కాకుండా.. స్టార్ హీరోయిన్ గా వున్నతస్థాయిలో వున్నప్పుడే పరిశ్రమకు స్వస్తి చెబితే.. దానికో తృప్తి వుంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ ‘‘కత్తి’’, విక్రమ్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది.

No comments:

Post a Comment