Wednesday 10 September 2014

Manchu Lakshmi Talks About Her Surname

Manchu Lakshmi Talks About Her Surname

మంచు లక్ష్మీ పేరుకు మంచు ఎందుకో తెలుసా?

Manchu lakshmi talks about her surname

సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు కూతురు Manchu Lakshmi Prasanna కి ఆనంద్ తో పెళ్లయ్యిందని, ఇటీవలే లక్ష్మీ తల్లి కూడా అయ్యిన విషయం అందరికి తెలిసిందే. అయితే పెళ్లయ్యిన తర్వాత కూడా లక్ష్మీ ప్రసన్న తన పుట్టింటి పేరునే, తన పేరు ముందు ఎందుకు పెట్టుకుందని ఎవరికి తెలియదు. ఈ విషయంపై ఎప్పుడూ, ఎక్కడ కూడా లక్ష్మీ స్పందించలేదు. ఈ ప్రశ్న అందరి మదిలో వున్నప్పటికీ కూడా... ‘తన తండ్రితో వున్న అనుబంధం అలాంటిది కాబట్టే.. అందుకే పెళ్లయ్యిన తర్వాత కూడా తన పుట్టింటి పేరు మంచునే తన పేరుకు పెట్టుకుంది’ అని అనుకుంటున్నారు అందరూ.

కానీ అసలు విషయం అది కాదని తెలిసిపోయింది. లక్ష్మీ ప్రసన్న ఇప్పటికీ కూడా తన పేరు ముందు ‘మంచు’ అని పెట్టుకోవడానికి గల కారణాన్ని తానే స్వయంగా చెప్పుకొచ్చింది. తాజాగా లక్ష్మీ ప్రసన్న ‘ఆలీ ATM’ కార్యక్రమంలో పార్టిసిపెంట్ గా వెళ్లింది. ఇందులో లక్ష్మీని ఆలీ... ‘ఎప్పుడు చూసిన మంచు లక్ష్మీ అంటారు.. కానీ అది మీ నాన్నగారి ఇంటి పేరు. మీ ఆయన గారి ఇంటి పేరేంటి?’ అని అడిగాడు. వెంటనే లక్ష్మీ స్పందిస్తూ... ‘మా ఆయన తమిళులు. వాళ్లకు ఇంటి పేర్లు వుండవు. మా ఆయన గారి ఫస్ట్ పేరు శ్రీనివాస్... అది మా ఆయన పేరు చివరన చేరుతోంది. మావారు... ఆనంద్. అది నా ఇంటి పేరు అవ్వాలి’ అని చెప్పుకొచ్చింది. వెంటనే ఆలీ..‘మరి మంచు అని తీసేసి.. ఆనంద్ లక్ష్మీ ప్రసన్న అని పెట్టుకోవచ్చుగా’ అని కాస్త మోహం వెటకారంగా పెట్టుకొని అడగడంతో... లక్ష్మీ..‘బాలేదు కదా! చూసారా.. మీరే ఫేస్ ఏదోలా పెట్టేస్తున్నారు. అయినా మంచు కొంచెం చల్లగా వుంటుంది కదా. అందుకే ఆ పేరుతోనే కంటిన్యూ అయిపోదామని అలా పెట్టుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

మంచు లక్ష్మీ పేరుకు మంచు ఎందుకో తెలుసా? Click here

No comments:

Post a Comment