Tuesday 9 September 2014

Hansika Prises Raviteja

Hansika Motwani Prises Raviteja

హన్సిక మోసేస్తుందిరా బాబోయ్...!

Hansika prises raviteja

ఏదేనా సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే... ఆ సినిమా గురించి భారీగా పబ్లిసిటీ చేయడం ప్రస్తుతం ప్రతీ ఇండస్ట్రీలో సర్వసాధారణం అయిపోయింది. ఆ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర యూనిట్ అంతా కూడా ఏదో ఒక రకంగా సినిమా గురించి ప్రమోట్ చేస్తూనే వుంటారు. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని సినిమాల గురించి ‘సినిమా అద్భుతంగా వచ్చింది.. వాళ్లు ఇలా చేసారు.. వీళ్లు ఇలా చేసారు. వాళ్లు అద్భుతంగా చేసారు. సంగీతం సిరిగిపోయింది’ అంటూ ఏదో ఒకరకంగా డబ్బాలు కొడుతూనే వుంటారు. అయితే తాజాగా అలాంటి పనే హీరోయిన్ హన్సిక కూడా చేస్తోంది.

ప్రస్తుతం Raviteja హీరోగా రెజీనా, Hansika Motwani హీరోయిన్లుగా నటించిన ‘పవర్’ సినిమా ఈనెల 12న విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ కు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమాపై ఎక్కడలేనంత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ చిత్ర యూనిట్ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ, సినిమాను బాగానే పబ్లిసిటీ చేస్తున్నారు. తాజాగా హన్సిక కూడా ఈ సినిమా గురించి ప్రమోట్ చేసే పనిలో పడింది.

ఇటీవలే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక హీరో రవితేజను ఆకాశానికి ఎత్తేసింది. మాస్ మహారాజను పొగడ్తలతో ముంచెత్తింది. వయసులో దాదాపు 20 సంవత్సరాలు పెద్దవాడైన రవితేజతో రొమాన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదా? అనే ప్రశ్నకు హన్సిక సమాధానమిస్తూ.... రవితేజ తనకన్నా రెండు పదుల వయసు పెద్దవాడైనా కూడా... తాను రవితేజతో నటిస్తున్నప్పుడు 25 ఏళ్ల యంగ్ హీరోతో నటించిన ఫీలింగ్ కలిగిందని నటనలో, డాన్స్ లలో నేటి యంగ్ హీరోలతో సమానంగా రవితేజ నిలవగలడని అంటూ మాస్ మహరాజను పొగడ్తలతో ముంచెత్తింది.

hansika prises raviteja-02

అయితే ఈ అమ్మడికి ప్రస్తుతం ఈ ‘పవర్’ సినిమా తప్ప మరో సినిమాలేవి. ఈ సినిమాకు ముందు తెలుగులో నాలుగైదు సినిమాలు అంగీకరించినా కూడా ఆ సినిమాలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడానికే హన్సిక ఇలా మాస్ మహరాజాను పొగిడేస్తుందంటూ టాలీవుడ్ లో ఈ అమ్మడిపై కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా కూడా రవితేజ మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. తను నటించిన ‘పవర్’ సినిమాపై రవితేజ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్టయ్యితే టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. చూద్దాం... మరి మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో.

No comments:

Post a Comment