Friday 5 September 2014

Parineeti Chopra Dating A New Guy

Parineeti Chopra Dating A New Guy

చిన్నవాడితోనైనా డేటింగ్ చేస్తానంటున్న పరిణితీ

Parineeti chopra dating a new guy

బాలీవుడ్ లో డేటింగులు, రొమాన్సులు, కిస్సింగులు, బ్రేకప్ లు.... ఇలాంటివన్నీ కూడా చాలా కామాన్. ఈ డేటింగ్ అనేది సినీతారల్లో మరింత ఎక్కువ అనే విషయం అందరికి తెలిసిందే. కొంతకాలం డేటింగ్ చేసేసి, ఆ తర్వాత నచ్చట్లేదని బ్రేకప్ చెప్పేసుకొని విడిపోతుంటారు. కానీ బాలీవుడ్ యువ హీరోయిన్, సెక్సీ భామ Parineeti Chopra మాత్రం అందుకు విరుద్ధం అని చెబుతోంది.

‘ఇశక్ జాదే’ చిత్రంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడికి ప్రస్తుతం డేటింగ్ విధానంపైన ఓ అభిప్రాయముంది. తనకు ఎలాంటి వాడితో డేటింగ్ చేయాలని వుందో చాలా చక్కగా చెప్పుకొచ్చింది. మరి పరిణితీ ఏం అన్నదో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా!

‘నేను ప్రేమలో పడాలంటే ఆ కుర్రాడు మానసికంగా చాలా దృఢమైనవాడిగా ఉండాలి. నాకు పిరికివాళ్లు నచ్చరు. అమాయకంగా ఉండేవార్ని అస్సలు ప్రేమించను. ఎంతో తెలివిగా, మానసికంగా చాలా పరిణతి ఉన్న అబ్బాయినే ప్రేమిస్తాను. అలాంటి అబ్బాయికి ఇరవయ్యేళ్ల వయసే అయినా సరే.. నాకు ప్రాబ్లమ్ లేదు. అతనితో డేటింగ్ చేసేస్తా.

ప్రేమ పేరుతో ఒకరిని... డేటింగ్ కోసం మరొకరిని సెలక్ట్ చేసుకునే అమ్మాయిని కాదు నేను. నేను ఎవర్ని ప్రేమిస్తానో వారితోనే డేటింగ్ చేస్తా.... నా మిగతా జీవితం అతనితో గడిపితే బాగుంటుందనే నమ్మకం కుదిరితే, అతడినే పెళ్లి కూడా చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇక ఈ అమ్మడిని ప్రేమలో పడేయటానికి చాలా మంది సిద్ధమైపోతున్నారు. మరి ఈ అమ్మడికి ఎవరు డేటింగ్ హీరో అవుతారో త్వరలోనే తెలియనుంది.

No comments:

Post a Comment