Wednesday 10 September 2014

Rakul Preet Singh For Kick 2 Movie

Rakul Preet Singh For Kick 2 Movie

రవితేజ కిక్ సరసన రకూల్ భామ

Rakul preet singh for kick 2 movie

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ Rakul Preet Singh ఈ మధ్య వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మనోజ్, గోపిచంద్ సినిమాలతో బిజీగా వుంది. అయితే తాజాగా మరో భారీ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్లుగా తెలిసింది. రవితేజ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్2’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో Ravi Teja సరసన హీరోయిన్ గా తమన్నా నటించబోతుందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఇందులో హీరోయిన్ గా మరో భామ పేరు వినిపిస్తోంది. ఆవిడే రకూల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడిని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తాజా సమాచారం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ మాటలు రాస్తున్నాడు.

ప్రస్తుతం రవితేజ నటించిన ‘పవర్’ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలకు భారీ స్పందన వస్తోంది. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

No comments:

Post a Comment