Thursday 29 January 2015

​Sanjana Drinking Toddy


కల్లు తాగి సూడరో... అంటూ ఎవరో కొంతమంది కల్లు ప్రియులు చెప్పారు. కల్లు తాగితే ఆ మజాయే వేరు అనేది వారి వాదన. అయితే మాములుగా సినీ సెలబ్రెటీలు ఎప్పుడూ కూడా పబ్బుల్లో దొరికే వైన్స్, కొత్త కొత్త రకాల మందు పానీయాలు స్వీకరిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. 

కానీ ప్రభాస్ మరదలు సంజనకు మాత్రం కల్లు మీద కన్నేసింది. తాను అనుకున్న విధంగా కల్లు తాగాలనే కోరిక తీర్చేసుకుంది. ఇంతకీ ప్రభాస్ మరదలు సంజన ఎవరని అనుకుంటున్నారా? ప్రభాస్ హీరోగా నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో త్రిష చెల్లెలిగా, ప్రభాస్ మరదలిగా నటించిన హీరోయిన్ సంజన గుర్తుందా? 

Hansika Sword Fighting For Puli

Hansika Sword Fighting For Puli
Hansika Sword Fighting For Puli

‘పవర్’ సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు లేక కోలీవుడ్ లోనే కాలం గడిపేస్తున్న హన్సిక ప్రస్తుతం తమిళ సినిమాలతో బాగా బిజీగా వుంది. ‘దేశముదురు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు... తెలుగులో కొన్ని సినిమాలు నటించినప్పటికీ... అనుకున్న స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకోలేకపోయింది.
దీంతో కోలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన సినిమాలు విజయం సాధిస్తుండటంతో వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం హన్సిక తమిళంలో ‘పులి’ సినిమాలో నటిస్తోంది. విజయ్ హీరోగా ఓ సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం చెన్నై బీచ్ రోడ్డులో 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ ఓ భారీ రాజమహల్ సెట్ ను రూపొందించారు. -

Rudramadevi Teaser Release With Temper Movie

Rudramadevi Teaser Release With Temper Movie
Rudramadevi Teaser Release With Temper Movie
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. భారీ బడ్జెట్ తో, ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది.
గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. అయితే ఈ చిత్ర విడుదల కోసం తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ సంక్రాంతికి విడుదలకాలేదు. కానీ ‘రుద్రమదేవి’ని ఎన్టీఆర్ ‘టెంపర్’తో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

మామగారి రియల్ స్టోరీని ధనుష్ కాపీ కొట్టాడట!

Dhanush Rajinikanth Role Shamitabh Movie Director Balki Amitabh Bachchan
Dhanush Rajinikanth Role Shamitabh Movie Director Balki Amitabh Bachchan
తమిళ స్టార్ హీరో ధనుష్ తన మామ సూపర్ స్టార్ రజినీకాంత్ రియల్ స్టోరీని కాపి కొట్టినట్లు వార్తలొస్తున్నాయి. అంటే.. రజినీకాంత్ జీవితకథ స్ఫూర్తితో ధనుష్ మూవీ వస్తోందని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆర్.బాల్కి దర్శకత్వంలో అమితాబ్ధనుష్ ప్రధానపాత్రల్లో నటించిన ‘షమితాబ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలోనే రజనీ రియల్ లైఫ్ పాత్రలో ధనుష్ నటించనున్నాడని సమాచారం!
బస్ స్టాండులో తినుబండారాలు అమ్ముకునే కుర్రాడిగానూ.. తర్వాత బస్ కండక్టర్’గానూ పనిచేస్తూ చివరకు సూపర్ స్టార్’గా ఎదిగే పాత్రలో ధనుష్ కనిపిస్తాడని సమాచారం. అంటే.. ఈపాత్ర దాదాపు రజనీకాంత్ జీవితాన్ని పోలి వుంటుందని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు.. ఆయన జీవితంలో ఎదురైన కొన్ని ఆసక్తికర సంఘటనలను కూడా ఈ మూవీలో జోడించారట! అయితే.. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు చాలా గోప్యంగా వుంచుతున్నారు.

Friday 23 January 2015

Beeruva Movie Review | Sundeep Kishan Beeruva Movie Review

బీరువా
 

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో వరుస హిట్ సినిమాలతో దూసుకొస్తున్న సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బీరువా'. సందీప్ కిషన్, సురభి జంటగా కన్మణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్, ఉషా కిరణ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఇపుడు చూద్దాం.
ప్లస్ పాయింట్స్:
సందీప్ కిషన్ నటనలో కొత్తదనం లేకపోయినప్పటికీ, సంజు పాత్రకు మాత్రం న్యాయం చేసాడు. డాన్సులు, ఫైట్లు బాగా చేసాడు. ఇక సురభి నటన పర్వాలేదు. నటన, గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. అనీషా సింగ్ పాత్ర తక్కువ నిడివే అయినప్పటికీ.. ఉన్నంతలో హాట్ గా కనిపించి అలరించింది. ఇక సీనియర్ నరేష్, సప్తగిరి, శంకర్ కామెడి ట్రాక్స్ సూపర్బ్. థియేటర్లో నవ్వులే నవ్వులు. వీరి కామెడి సీన్స్ తెగ నవ్విస్తాయి. ఇక మిగత నటీనటులు వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్:
కథలో ఎలాంటి కొత్తదనం లేదు. రెగ్యులర్ కథకే బీరువా అనే వస్తువుకు జోడించి, కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సినిమాలో వచ్చే తరువాతి సన్నివేశాన్ని ప్రేక్షకులు వెంటనే ఊహించేయవచ్చు. కథనంలో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. క్లైమాక్స్ సీన్ బాగా సాగదీశారు. రన్ టైం ఇంకాస్త తగ్గించి వుంటే బాగుండేది.
సాంకేతిక వర్గ పనితీరు:
సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చోటా విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేంను అందంగా చూపించాడు. ఇక తమన్ సంగీతం పర్వాలేదు. పాటలు బాగున్నాయి. ఎడిటర్ గౌతమ్ రాజు ఎడిటింగ్ లో మరింత కేర్ తీసుకొని ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. కత్తెరకు మరింత పనిచెప్పి వుంటే బాగుండేది.
వెలిగొండ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ పర్వాలేదు. ఇక దర్శకుడ్ కన్మణి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ విభాగాల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. పాతకథకే బీరువాను జతచేసి కొత్తగా చూపించాలని అనుకున్నాడు. కానీ అందులో కొత్తదనం ఏం కనిపించలేదు. ఇక ఉషా కిరణ్ ఫిలిమ్స్ – ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.
చివరగా:
బీరువా: ఒక్కసారి చూడవచ్చు

Kalyan Ram Pataas Movie Review


 Pataas Movie Review

Pataas Movie Review
Pataas Movie Review
అవినితీపరుడైన పోలీస్ ఆఫీసర్ కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) కావాలనే హైదరాబాద్ కు బదిలీ చేయించుకుంటాడు. హైదరాబాద్ కు ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. ఇదే సమయంలో స్థానిక రాజకీయ నాయకుడు (అశుతోష్ రానా)ను ప్రోత్సహిస్తాడు. ఈ అశుతోష్ వ్యవహారం హైదరాబాద్ డిజిపి(సాయి కుమార్) కు తలనొప్పిగా మారతాడు. అయితే కళ్యాణ్ హైదరాబాద్ రావడానికి గల అసలు కారణం తెలుసుకొని డిజిపి షాక్ అవుతాడు. అసలు కళ్యాణ్ సిన్హా హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి? సినిమాలో వున్న ఆ నిజం ఏంటి? అవినితీ అధికారిగా కళ్యాణ్ సిన్హా ఎందుకు మారాడు? అనే అంశాలు తెలియాలంటే వెండితెర మీద చూడాల్సిందే.