Wednesday 10 September 2014

Niharika Talks About Kajal Agarwal

Niharika Talks About Kajal Agarwal

తండ్రి కోసం కాజల్, నిహారిక ఫైట్

Niharika talks about kajal agarwal

టాలీవుడ్ హీరోయిన్ Kajal Agarwal, మెగా బ్రదర్ నాగబాబు కూతురుNiharika ల మధ్య ‘నాన్న’ గొడవ నడుస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు కూతురు నిహారికయే చెప్పింది. ఆలీ తాజాగా ప్రారంభించిన ఓ కార్యక్రమానికి నిహారిక పార్టిసిపెంట్ గా వెళ్లింది. అక్కడ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.

అసలు అక్కడ ఏం జరిగిందంటే.... కృష్ణవంశీ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా నటించిన ‘చందమామ’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ తండ్రిగా నాగబాబు నటించాడు. ఇందులో నాగబాబు, కాజల్ ల మధ్య తండ్రికూతుళ్ల మధ్య వుండే అనుబంధాన్ని మరీ చాలా ముద్దుగా, ప్రేమగా చూపించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఆ సినిమాలో నాన్న నాన్న అంటూ తెగ అల్లరి చేస్తూ వుంటుంది.

అయితే ఈ విషయం నాగబాబు సొంత కూతురు నిహారికకు నచ్చలేదట. ఎందుకు నచ్చలేదో నిహారిక మాటల్లోనే.... ‘ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో మా నాన్న, కాజల్ ఇద్దరూ తండ్రీ కూతుళ్లుగా నటించారు. ఆ సమయంలో కూతురు, ఫాదర్ రిలేషన్ బాగా ఎక్కేసింది వారీ బ్లడ్ లోకి. అయితే మా నాన్నని ‘నాన్న నాన్న’ అని పిలిస్తే... నేను కాజల్ తో చెప్పాను....‘మా నాన్నను నాన్న అని పిలవకు.. అంకుల్ అని పిలువు. సినిమా తర్వాత నీకు సంబంధం లేదు’ అని చెప్పాను. ఇక అప్పటి నుంచి మొదలైంది మా గొడవ’ అంటూ Kajal Agarwal తో తను పడుతున్న గొడవను చెప్పుకొచ్చింది.

వెంటనే ఆలీ అంతటితో ఊరుకోకుండా... ‘అంటే ఆ అమ్మాయి మీ నాన్నను ‘నాన్న నాన్న..’ అంటూ వుంటే మీ అమ్మకు ఏమైనా అనుమానం వచ్చిందా మీ నాన్న మీద’ అంటూ కామెంట్ చేసాడు. కానీ నిహారిక...‘లేదండి.. అది సినిమా అని మా అమ్మకు బాగా తెలుసు’ అని చెప్పేసింది. కావాలంటే మీరు వీడియో చూడండి.. మీకే అర్ధమవుతుంది.

వీడియో కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

తండ్రి కోసం కాజల్, నిహారిక ఫైట్

No comments:

Post a Comment