Friday 5 September 2014

Rakul Preet Singh Tweets On Her Dance

Rakul Preet Singh Tweets On Her Dance

ఆ పాటలో ఈ అమ్మడు చింపేసిందట

Rakul preet singh tweets on her dance

ఆది, Rakul Preet Singh జంటగా నటిస్తున్న చిత్రం ‘రఫ్’. సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమాలోని చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాటలో రకూల్ డాన్స్ చింపేసిందట. ఈ మాట ఎవరో చెప్పలేదు. స్వయంగా రకూలే చెప్పుకొచ్చింది.

‘రఫ్’ సినిమాలోని ఒక పాట కోసం సాలిడ్ డాన్స్ చేస్తున్నాను. స్టెప్స్ చాలా బాగుంటాయి. ఇప్పటివరకు నేను మాక్సిమం డాన్స్ చేసింది ఈపాట కోసమే. ఐ లవ్ దిస్ సాంగ్ అంటూ రకూల్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. మరి తను చెప్పినట్లుగా ఈ సినిమాలోని ఏ పాటలో రకూల్ తన డాన్స్ ఇరగదీసిందో తెలుసుకోవాలంటే ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

‘ప్యార్ మే పడిపోయానే’ వంటి ఫ్లాప్ చిత్రం తర్వాత వస్తున్న ఈ ‘రఫ్’ చిత్రంతో ఎలాగైనా విజయం సాధించాలని ఆది చాలా కసిగా వున్నాడు. ఇదిలా వుంటే ఆదాశర్మతో కలిసి ఆది ‘గరం’ అనే చిత్రం తాజాగా మొదలుపెట్టాడు. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నిన్న ఘనంగా జరిగాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ‘రఫ్’ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment