Saturday 20 December 2014

తెలుగులో విక్రమ్ ‘ఐ’కు భారీ క్రేజ్

b0810be1e7b831f1d1fd88723febc4de_Lప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘ఐ’. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విక్రమ్, అమీజాక్సన్ హీరోహీరోయిన్లుగా నటించారు. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే విడుదలైన కొత్త ట్రైలర్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొడుతోంది. అదిరిపోయే గ్రాఫిక్స్ తో శంకర్ తనదైన మార్క్ తో తెరకెక్కిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర వైజాగ్ పంపిణీ హక్కులు 4కోట్లు, గుంటూరు పంపిణీ హక్కులు 3.6 కోట్లు, అలాగే కృష్ణ 2.25కోట్లు, తూర్పు గోదావరి హక్కులు 3 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా తెలిసింది. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది.

Thursday 18 December 2014

'ఆంధ్రా పోరి'తో వస్తున్న పూరీ కొడుకు

‘చిరుత’, ‘బుజ్జిగాడు’, ఏక్ నిరంజన్’ ‘గబ్బర్ సింగ్’ వంటి పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్... ఇపుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరాఠీ భాషలో హిట్ అయిన ‘టైం పాస్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.

వాలు కళ్ల వయ్యారి... మత్తుకళ్ల సింగారి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర, యువ హీరోలందరితో కలిసి నటించిన హాట్ హీరోయిన్ శ్రియ. ఇటీవలే విడుదలైన ‘మనం’ సినిమా ఈ అమ్మడికి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రియ నటనకు మంచి మార్కులు పడ్డాయి. గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా నటిగా కూడా తనని తాను నిరూపించుకుంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం శ్రియకు తెలుగులో అవకాశాలు వచ్చిపడుతున్నాయి -

మొదలైన ఎన్టీఆర్, సుకుమార్ సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నేడు (డిసెంబర్18) 11:39 గంటలకు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. -

Tuesday 16 December 2014

బాలయ్య లయన్ టీజర్ విడుదల తేది

లెజెండ్’ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన బాలయ్య ఫస్ట్ లుక్ కు భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రానికి ‘లయన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలిసింది. కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఎస్.ఎల్.వి సినిమా సంస్థలో నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను నూతన సంవత్సర సంధర్భంగా అభిమానుల కోసం డిసెంబర్ 31న అర్థరాత్రి న్యూ ఇయర్ ఎంట్రీ సమయంలో విడుదల చేయనున్నారు.

అదరగొడుతున్న గోపాల గోపాల పోస్టర్

హిందీలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలలో నటించిన ‘ఓమైగాడ్’ చిత్రాన్ని తెలుగులో ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్ర దర్శకుడు డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కళ్యాణ్, వెంకటేష్, శ్రియ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లలో నిర్మాతలు డి. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
వెంకటేష్ ఆపదలో వున్నప్పుడు పవన్ కళ్యాణ్ బైక్ వచ్చి కాపాడే సన్నీవేశం ఇది. ఈ సన్నీవేశంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలిసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈనెల చివర్లో విడుదల చేయనున్నారు. అదేరోజున ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు.
Read Full Story at http://www.cinewishesh.com/news/191-cinema-film-movie-headlines-news/53249-gopala-gopala-first-look-poster-released.html

అమితాబ్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనా?

అప్పటి నుంచి అమితాబ్ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అలాంటి అమితాబ్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మళ్లీ రాజకీయాల్లోకి రానని అమితాబ్ స్పష్టం చేయడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు అమితాబ్. రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేసానని, అయితే అప్పట్లో తన భావోద్వేగాలు రాజకీయాల వైపు నడిపించాయని...కానీ రాజకీయాలకు, నిజ జీవిత బావోద్వేగాలకు చాలా వ్యత్యాసం వుంటుందని తర్వాత తెలుసుకున్నానని అన్నారు.

Monday 15 December 2014

ధోని భార్యగా బాలీవుడ్ కిస్సింగ్ లేడీ

ఇండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని జీవితకథ ఆధారంగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. నీరజ్ పాండే రూపొందించనున్న ఈ సినిమాలో ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ నటించనున్నాడు. అయితే మరో క్రికెటర్ సురేష్ రైనా పాత్రలో రాంచరణ్ నటింనున్నాడని వార్తలొచ్చాయి. కానీ చరణ్ ఈ సినిమాను అంగీకరించలేదు. అయితే ధోనీ ఇటీవలే సాక్షిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరి నిజజీవితంలో వున్న సాక్షిని వెండితెర మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలీయా భట్ ను ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ అమ్మడితో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఏదో ఒక విషయం ఫైనలైజ్ చేయనున్నారు.

అదిరిపోయిన రఘువరన్ బిటెక్ ట్రైలర్

ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన ‘వేలయిళ్ల పట్టతారి(వి.ఐ.పి)’ చిత్రం ఇటీవలే తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులోకి ‘రఘువరన్ బిటెక్’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. తెలుగులో స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి రవికిషోర్ విడుదల చేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ పూర్తయ్యి నాలుగేళ్లవుతున్న ఓ కుర్రాడికి ఉద్యోగం రాకుండా ఎన్నో కష్టాలు పడుతుంటాడు. అలాంటి కుర్రాడి జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి?

కత్రినా దక్కదని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుడు

బీహార్ కు చెందిన రాహుల్ కుమార్ సింగ్ అనే యువకుడు బీటెక్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇతడికి కత్రినా అంటే చాలా ఇష్టం. కానీ తనలాంటి అభిమానులు కత్రినాకు కొన్ని లక్షల మంది వున్నారని తెలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఫ్లాట్ లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇతని మృతదేహం వద్ద .. Read More  http://goo.gl/un9MMN

Thursday 11 December 2014

Super Star Rajinikanth Movie Lingaa Hit - Lingaa Review Updates By Cinewishesh

cinima-reviews
 తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, అనుష్క, సోనాక్షీ సిన్హా కలిసి నటించిన తాజా చిత్రం ‘లింగా’. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా నేడు (డిసెంబర్ 12) ‘లింగ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసారు. మరి భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్రం ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Lingaa Telugu Movie Updates and Ratings Click Here


 ప్లస్ పాయింట్స్ :
 ‘లింగ’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమా మొత్తం రజనీ తన నటనతో అదరగొట్టాడు. స్టైల్, యాక్షన్, డాన్స్ చింపేసాడు. వయసు ప్రభావం కనిపించకుండా అపుడెప్పుడో వచ్చిన ‘అరుణాచలం’ సినిమాలోని రజనీని చూసినట్లుగా చాలా యంగ్ గా కనిపించాడు. ఇక నటుడు జగపతి బాబు తన పాత్రకు వందశాతం న్యాయం చేసాడు. ఇక రజనీతో తొలిసారిగా జతకడుతున్న అనుష్క తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. గ్లామర్ పాత్రలో అందరిని ఆకట్టుకుంది. అలాగే ‘లింగ’తో సౌత్ కు ఎంట్రీ ఇస్తున్న సోనాక్షి సిన్హా పల్లెటూరి అమ్మాయిగా బాగా నటించింది. ముఖ్యంగా ఇందులో తను మాట్లాడే విధానం జనాలను బాగా ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు.
  మైనస్ పాయింట్స్ :
 ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్లు అంటూ ఏం లేవు కానీ.... భారీ అంచనాలతో విడుదలవ్వడంతో ప్రేక్షకులు భారీగా ఊహించేసుకున్నారు. గతంలో రజనీకాంత్ లో వున్న స్టైల్ ఈ సినిమాలో కాస్త తగ్గింది. అలాగే అనుష్కతో రజనీ చేసే రొమాంటిక్ సన్నీవేశాలు మరియు జగపతి బాబు పాత్రను సరిగ్గా చూపించలేకపోయారు. ఇక సంతానం, బ్రహ్మనందం వంటి స్టార్ కమెడియన్లు వున్నా కూడా కామెడీ అనుకున్న రేంజులో లేకపోయింది.

  సాంకేతిక వర్గ పనితీరు:
 ఈ సినిమాకు నలుగురు మేజర్ ప్లస్ పాయింట్స్ గా తీసుకోవచ్చు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, నిర్మాత. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మరోసారి రజినీతో ఓ అద్భుతమైన చిత్రాన్ని తీసి తానేంటో నిరూపించుకున్నాడు. కాకపోతే కథతో పాటు ఫ్యాన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడంతో కాస్త అక్కడక్కడ కాస్త క్లారిటీ మిస్సయ్యింది. ఇక ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. రజినీతో పాటుగా మిగతా అందరూ ఆర్టిస్టులను అద్భుతంగా చూపించడమే కాకుండా... విజువల్స్ అన్ని కూడా చాలా గ్రాండ్ గా చూపించాడు. కొన్ని కొన్ని సన్నివేశాలలో అద్భుతంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి కొన్ని సన్నీవేశాలు సూపర్బ్. ఇక రజనీని యంగ్ గా చూపించడంలో రత్నవేలు వందకు వంద మార్కులు కొట్టేసాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. రెహమాన్ అందించిన పాటలకు ముందుగా అంతగా ఆదరణ లభించకపోయినప్పటికీ... సినిమాలో విజువల్స్ తో పాటు చూస్తుంటే ప్రతి పాట బాగుంది. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అందించాడు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్... నిర్మాత రాక్ లైన్ వెంకటేష్. రజినీతో సినిమా అంటే ఎంత గ్రాండ్ గా వుండాలో అంత కంటే పదిరేట్లు గ్రాండ్ గా నిర్మించాడు. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా అద్భుతంగా నిర్మించాడు.

చివరగా: లింగ: రజనీ అభిమానులకు పండగే.


 The Article of Original Source at http://www.cinewishesh.com/movie-film-reviews/200-movie-film-reviews/53157-lingaa-telugu-movie-review.html