Monday 8 September 2014

Mahesh Babu In 100 Crores Budget Film

Mahesh Babu In 100 Crores Budget Film

మహేష్ తో 100 కోట్ల బడ్జెట్ సినిమా?

Mahesh babu in 100 crores budget film

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్5 భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ గా పేరుతెచ్చుకున్న 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ ‘దూకుడు’ సినిమాతో టాప్ స్థానాన్ని సొంతం చేసుకుంది. మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ ఇక వెనక్కితిరిగి చూడలేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థలో ఒకటిగా చేరిపోయింది.

‘దూకుడు’ తర్వాత మహేష్ తో ‘1 నేనొక్కడినే’ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే తాజాగా మళ్లీ Mahesh Babu తో కలిసి ‘ఆగడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే మహేష్ నటించిన ‘దూకుడు’ చిత్రాన్ని కన్నడంలో ‘పవర్’ పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో మహేష్ తో 14రీల్స్ కు లక్కు బాగానే కలిసొచ్చింది. దీంతో తాజాగా మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని మహేష్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు 14 రీల్స్ సంస్థ వారు.

14 రీల్స్ వారు Mahesh Babu తో 100కోట్ల సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ 14 రీల్స్ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం వారు మహేష్ తో 100కోట్ల సినిమా తీయడానికి సిద్దంగానే ఉన్నారు కానీ అంతటి బడ్జెట్ ను తిరిగి రాబట్టగలిగే దర్శకుడితోనే ఈ చిత్రం నిర్మించే ఆలోచనలు వున్నట్లుగా తెలిసింది. అయితే ఆ దర్శకుడు ఎవరూ అనేది త్వరలోనే తెలియనుంది.

ఎందుకంటే ప్రస్తుతం 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ‘ఆగడు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనున్నారు. మరి ఈ 100 కోట్ల బడ్జెట్ చిత్రం గురించి త్వరలోనే తెలియనుంది.

No comments:

Post a Comment