Monday 8 September 2014

Ileana Signed Opposite Shahrukh

Ileana Signed Opposite Shahrukh

Ileana signed opposite shahrukh

‘దేవదాస్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ Ileana ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా స్థానాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఈమధ్య ఇలియానా నటించిన తెలుగు చిత్రాలు ఫ్లాప్ అవుతుండటంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో ఇలియానా నటించిన చిత్రాలు విడుదలయ్యి విజయాలు సాధిస్తుండటంతో అక్కడికే మకాం మార్చేసింది.

దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ అడపదడపా అప్పుడప్పుడు సినిమా ఆఫర్లు వస్తూనే వున్నాయి. హిందీలో Ileana నటించిన ‘బర్ఫీ’ చిత్రం నటిగా మంచి పేరును తెచ్చిపెట్టింది. బాలీవుడ్ లో ఎంత మంది హీరోలతో నటించినా కూడా షారుక్, సల్మాన్, అమీర్ లతో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. అయితే తాజాగా అలాంటి ఓ భారీ ఆఫర్ ఈ అమ్మడికి వరించినట్లుగా తెలిసింది.

తాజాగా షారుక్ ఖాన్ నటించబోయే ఓ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. షారుక్ నటించబోయే తర్వాతీ చిత్రం ‘ఫ్యాన్’. ఈ సినిమా కోసం ముందుగా షారుఖ్ కి జోడీగా వాణి కపూర్, పరిణీతి చోప్రా లను పరిశీలించారు కానీ తాజాగా ఈ అవకాశం ఇలియానాకి వెళ్లిందని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రానుంది.

షారుక్ ఖాన్ ప్రస్తుతం ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఫరాఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇందులో దీపికా పదుకునే, అభిషేక్ బచ్చన్ లతో పాటుగా పలువురు ప్రధాన తారాగణం నటిస్తున్నారు.

No comments:

Post a Comment