Wednesday 10 September 2014

Shilpa Shetty Crying After Watching Meri Kom

Shilpa Shetty Crying After Watching Meri Kom

ప్రియాంకను చూసి ఏడ్చేసిన శిల్పాశెట్టి

Shilpa shetty crying after watching meri kom

Priyanka Chopra  నటించిన ‘మేరీకోమ్’ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను అన్ని సినిమాల వలే సమానంగా చూడాలని, లేడీ ఓరియేంటెడ్ చిత్రమంటూ వేరు చేయవద్దని ప్రియాంక ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన క్షణం నుంచి మంచి స్పందనను సొంతం చేసుకొంటోంది.

ముఖ్యంగా మహిళా ప్రేక్షకాదరణ ఈ సినిమాకు మరింత ఎక్కువగా వుంది. దీంతో సినిమాకు భారీ పబ్లిసిటీ అవుతోంది. ఇందులో ప్రియాంక అద్భుతంగా నటించిందని అందరూ చెబుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చూసి ఏడ్చానంటుంది బాలీవుడ్ భామ శిల్పాశెట్టి.

అవును ఇటీవలే ‘మేరీ కోమ్’ చిత్రాన్ని శిల్పా చూసిందిట. ప్రియాంక నటన చూసి ఉద్వేగానికి లోనై ఏడ్చేసినట్టు ట్విట్ చేసింది. ‘మేరీ కోమ్ సినిమా చూశాను. ప్రియాంక అద్భుతంగా నటించింది. ఒమంగ్ దర్శకత్వం చాలా బాగుంది. ఈ సినిమా చూసి కంటతడి పెట్టుకున్నాను. మేరీ కోమ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా’ అని ట్విట్ చేసింది శిల్పా శెట్టి.

Shilpa Shetty  ట్వీట్ ఏమో గానీ... ఈ సినిమా మాత్రం మహిళా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వున్న సమాజంలో ఇలాంటి సినిమాల ద్వారా తమని తాము ఎలా రక్షించుకోవాలో, మానసికంగా ఎలా వుండాలో, ఎలాంటి పరిస్థితులనైనా ఎలా ఎదుర్కొనాలో ‘మేరీ కోమ్’ సినిమాలో ప్రియాంక చోప్రా అద్భుతంగా నటించింది. ఈ సినిమా కలెక్షన్ల విషయం పక్కన పెడితే.. అవార్డులు మాత్రం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం... ఏం జరుగనుందో.

No comments:

Post a Comment