Wednesday 10 September 2014

Samantha At Enakkul Oruvan Audio Launch

Samantha At Enakkul Oruvan Audio Launch

అక్కడ సిద్ధుతో సమంత ఒకటే ఇకఇకలు

Samantha at enakkul oruvan audio launch

టాలీవుడ్ హీరోయిన్ Samantha, నటుడు సిద్ధార్థ్ ల మధ్య ప్రేమాయణం నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ నుంచి సిద్ధుని బహిష్కరించడంతో తెలుగులో సినిమాలు చేయకుండా కేవలం తమిళంలోనే సినిమాలు చేస్తూ, కాలం గడిపేస్తున్నాడు.

తమిళంలో ఈ అమ్మడికి కలిసి రావడంలేదు... ఆ బాబుకి తెలుగులో ఎంట్రీ లేదు. దీంతో సిద్ధు, సమంతలు కలుసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. అయితే ఈ మధ్య సిద్ధార్థ్ తమిళంలో నటించిన ‘జిగర్తండా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో ఫుల్ జోష్ మీదున్నాడు. తాజాగా కన్నడంలో విజయం సాధించిన ‘లూసియా’ చిత్రాన్ని తమిళంలో ‘ఎన్నక్కుల్ ఒరువన్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తన ప్రేయసి సమంతను ఆహ్వానించాడు. సమంత వచ్చిన ఆ కార్యక్రమంలో... అబ్బో.. వీరిద్దరు తెగ సందడి చేసారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ.. ఆ వేడుకను బాగానే ఎంజాయ్ చేసారు.

అయితే ఈ కార్యక్రమంలో సిద్ధు మాట్లాడుతూ... ‘కన్నడ చిత్రం ‘లూసియా’ చూశాక చాలా సంతృప్తి కలిగింది. ఎలాగైనా ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోవాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే సీవీ కుమార్ హక్కులు తీసుకొన్నాడని తెలిసింది. ఆయనకు ఫోన్ చేసి ‘సినిమాలో నేను నటిస్తాను, ఎలాగైనా నాతో తీయండి’ అని అడుక్కొన్నాను. ఆయన మాత్రం ‘అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన పనిలేదు’ అంటూ హ్యాపీగా అవకాశం ఇచ్చేసాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

No comments:

Post a Comment