Tuesday 30 September 2014

Govindudu Andarivadele Telugu Movie Review


గోవిందుడు అందరివాడేలే

చిత్రం  :గోవిందుడు అందరివాడేలే
బ్యానర్  :పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
దర్శకుడు  :కృష్ణవంశీ
నిర్మాత  :బండ్ల గణేష్
సంగీతం  :యువన్ శంకర్ రాజా
సినిమా రేటింగ్  :3.75

ఛాయాగ్రహణం  :సమీర్ రెడ్డి
ఎడిటర్  :నవీన్ నులి
నటినటులు  :రాంచరణ్ తేజ, కాజల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాశ్ రాజ్, జయసుధ తదితరులు


Story:

చిన్నప్పటి నుంచి లండన్ లోనే పుట్టి పెరిగిన ఇండియా కుర్రాడు అభిరామ్(రామ్ చరణ్). అభిరామ్ పెరిగింది లండన్ లోనే అయినా భారతదేశ ఆచార సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం. మన పని మనమే చేసుకోవాలి – మన కుటుంబాన్ని మనమే కలుపుకుపోవాలి అనే సిద్దాంతాన్ని నమ్ముతాడు అభిరామ్. అలా ఒకరోజు తన తండ్రి ద్వారా తన కుటుంబ సభ్యులగురించి తెలుసుకుంటాడు అభిరామ్. ఆ కుటుంబంలో తాము కూడా కలిసిపోవాలని ఇండియాకి వస్తాడు అభిరామ్. అలా వచ్చిన అభిరామ్ కు..... తన సొంత ఊరు కోసం ఏమన్నా చేయాలనుకునే బాలరాజు (ప్రకాష్ రాజ్) కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. అలా ఎంట్రీ అయిన అభిరామ్... తాను కూడా ఆ కుటుంబంలో ఒకడిని అని చెప్పకుండా... ఆ కుటుంబంలోని వారందరితో ఎలా కలిసిపోయాడు ?  Read more ..

Click here for more Movie Reviews ..

Wednesday 10 September 2014

Niharika Talks About Kajal Agarwal

Niharika Talks About Kajal Agarwal

తండ్రి కోసం కాజల్, నిహారిక ఫైట్

Niharika talks about kajal agarwal

టాలీవుడ్ హీరోయిన్ Kajal Agarwal, మెగా బ్రదర్ నాగబాబు కూతురుNiharika ల మధ్య ‘నాన్న’ గొడవ నడుస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు కూతురు నిహారికయే చెప్పింది. ఆలీ తాజాగా ప్రారంభించిన ఓ కార్యక్రమానికి నిహారిక పార్టిసిపెంట్ గా వెళ్లింది. అక్కడ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.

అసలు అక్కడ ఏం జరిగిందంటే.... కృష్ణవంశీ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా నటించిన ‘చందమామ’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ తండ్రిగా నాగబాబు నటించాడు. ఇందులో నాగబాబు, కాజల్ ల మధ్య తండ్రికూతుళ్ల మధ్య వుండే అనుబంధాన్ని మరీ చాలా ముద్దుగా, ప్రేమగా చూపించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఆ సినిమాలో నాన్న నాన్న అంటూ తెగ అల్లరి చేస్తూ వుంటుంది.

అయితే ఈ విషయం నాగబాబు సొంత కూతురు నిహారికకు నచ్చలేదట. ఎందుకు నచ్చలేదో నిహారిక మాటల్లోనే.... ‘ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో మా నాన్న, కాజల్ ఇద్దరూ తండ్రీ కూతుళ్లుగా నటించారు. ఆ సమయంలో కూతురు, ఫాదర్ రిలేషన్ బాగా ఎక్కేసింది వారీ బ్లడ్ లోకి. అయితే మా నాన్నని ‘నాన్న నాన్న’ అని పిలిస్తే... నేను కాజల్ తో చెప్పాను....‘మా నాన్నను నాన్న అని పిలవకు.. అంకుల్ అని పిలువు. సినిమా తర్వాత నీకు సంబంధం లేదు’ అని చెప్పాను. ఇక అప్పటి నుంచి మొదలైంది మా గొడవ’ అంటూ Kajal Agarwal తో తను పడుతున్న గొడవను చెప్పుకొచ్చింది.

వెంటనే ఆలీ అంతటితో ఊరుకోకుండా... ‘అంటే ఆ అమ్మాయి మీ నాన్నను ‘నాన్న నాన్న..’ అంటూ వుంటే మీ అమ్మకు ఏమైనా అనుమానం వచ్చిందా మీ నాన్న మీద’ అంటూ కామెంట్ చేసాడు. కానీ నిహారిక...‘లేదండి.. అది సినిమా అని మా అమ్మకు బాగా తెలుసు’ అని చెప్పేసింది. కావాలంటే మీరు వీడియో చూడండి.. మీకే అర్ధమవుతుంది.

వీడియో కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

తండ్రి కోసం కాజల్, నిహారిక ఫైట్

Is Samantha Quitting Telugu Films

Is Samantha Quitting Telugu Films

త్వరలో సమంత సినీ సన్యాసం తీసుకోనుందా ?

 
Is samantha quitting telugu films

‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన Samantha త్వరలో సినీ సన్యాసం తీసుకోబోతుందని వార్తలొస్తున్నాయి. ‘ఏమాయ చేసావే’ సినిమా తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’ సినిమాలతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో ఒకప్పుడు ‘గోల్డెన్ లెగ్’ అని పిలిచిన ఈ అమ్మడిని ప్రస్తుతం ‘ఐరెన్ లెగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ భామకు ఒళ్లుమండి ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసేసి, సినిమాలకు స్వస్తి చెప్పడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది.

యంగ్ హీరోలనుంచి సీనియర్ల వరకు అందరితో జతకట్టడానికి ఆసక్తి చూపిన ఈ గ్లామర్ డాల్.. నాయికగా వున్నతస్థాయిలో వుండగానే నటనకు స్వస్తి పలుకుతానంటోంది. ఎందుకంటే.. మార్కెట్ లో తన వ్యాల్యూ పడిపోయిన తర్వాత పరిశ్రమకు గుడ్ బై చెబితే చెడ్డ పేరు వస్తుందని.. అందుకే మంచి నాయికగా వున్నతస్థాయిలో వున్నప్పుడే నటకు, పరిశ్రమకు స్వస్తి చెబుతానని క్లారిటీ ఇచ్చుకుంది. ఇందుకు గల మరిన్ని కారణాల కూడా వున్నాయి. ఈ అమ్మడి సొంత పరిశ్రమ అయిన కోలీవుడ్ లో ఇంతవరకు విజయం దక్కలేదు.

భారీ సినిమాల్లో నటించి, అందులో అందాలను ఒలకబోసినా.. ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఇటీవలే అంజాన్ సినిమాలో బికినీ వేసుకుని కనువిందు చేసినా.. ఆమెకు లాభం చేకూరలేదు. టాలీవుడ్ లోలాగే కోలీవుడ్ లో తన హవాను కొనసాగించుకోవాలని ఎంతప్రయత్నించినప్పటికీ.. ఈ అమ్మడికి ఒక్క విజయం కూడా అక్కడ దక్కడం లేదు. దీంతో తనకు కోలీవుడ్ లో ఎక్కడా చెడ్డపేరు వస్తుందేమోనని భయపడుతోంది సమంత!

ప్రస్తుతం పరిశ్రమకు ఎంతోమంది కొత్త కథానాయికలు వస్తున్నారు. అయితే వాళ్లందరూ కొన్ని వ్యక్తిగత, ప్రేమ వ్యవహారాలు, ఇతర కారణాల వల్ల కేవలం రెండుమూడు సినిమాలు మాత్రమే పరిమితమవుతున్నాయి. మరికొంతమంది తారలైతే ప్రేమవ్యవహారంలో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల గురించి స్పందించిన సమంత.. తాను కూడా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చిందని.. అయితే కొందరు తన శ్రేయస్సు కోరడంతో తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపింది.

చిత్రపరిశ్రమలో వచ్చే ప్రతిఒక్కరికి ధైర్యం చెప్పేవాళ్లు ఖచ్చితంగా వుండాలని.. అప్పుడే వాళ్లు ధైర్యంతో ముందడుగు వేయగలరని సమంత భావిస్తోంది. సమంత కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో వున్నప్పుడు సినిమాలకు దూరం అవ్వాలని భావించిన నేపథ్యంలో.. కొందరు తనలో ధైర్యాన్ని కూడగట్టారని తెలిపింది. దీంతో ఈ అమ్మడు మళ్లీ అటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కాకుండా.. స్టార్ హీరోయిన్ గా వున్నతస్థాయిలో వున్నప్పుడే పరిశ్రమకు స్వస్తి చెబితే.. దానికో తృప్తి వుంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ ‘‘కత్తి’’, విక్రమ్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది.

Manchu Lakshmi Talks About Her Surname

Manchu Lakshmi Talks About Her Surname

మంచు లక్ష్మీ పేరుకు మంచు ఎందుకో తెలుసా?

Manchu lakshmi talks about her surname

సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు కూతురు Manchu Lakshmi Prasanna కి ఆనంద్ తో పెళ్లయ్యిందని, ఇటీవలే లక్ష్మీ తల్లి కూడా అయ్యిన విషయం అందరికి తెలిసిందే. అయితే పెళ్లయ్యిన తర్వాత కూడా లక్ష్మీ ప్రసన్న తన పుట్టింటి పేరునే, తన పేరు ముందు ఎందుకు పెట్టుకుందని ఎవరికి తెలియదు. ఈ విషయంపై ఎప్పుడూ, ఎక్కడ కూడా లక్ష్మీ స్పందించలేదు. ఈ ప్రశ్న అందరి మదిలో వున్నప్పటికీ కూడా... ‘తన తండ్రితో వున్న అనుబంధం అలాంటిది కాబట్టే.. అందుకే పెళ్లయ్యిన తర్వాత కూడా తన పుట్టింటి పేరు మంచునే తన పేరుకు పెట్టుకుంది’ అని అనుకుంటున్నారు అందరూ.

కానీ అసలు విషయం అది కాదని తెలిసిపోయింది. లక్ష్మీ ప్రసన్న ఇప్పటికీ కూడా తన పేరు ముందు ‘మంచు’ అని పెట్టుకోవడానికి గల కారణాన్ని తానే స్వయంగా చెప్పుకొచ్చింది. తాజాగా లక్ష్మీ ప్రసన్న ‘ఆలీ ATM’ కార్యక్రమంలో పార్టిసిపెంట్ గా వెళ్లింది. ఇందులో లక్ష్మీని ఆలీ... ‘ఎప్పుడు చూసిన మంచు లక్ష్మీ అంటారు.. కానీ అది మీ నాన్నగారి ఇంటి పేరు. మీ ఆయన గారి ఇంటి పేరేంటి?’ అని అడిగాడు. వెంటనే లక్ష్మీ స్పందిస్తూ... ‘మా ఆయన తమిళులు. వాళ్లకు ఇంటి పేర్లు వుండవు. మా ఆయన గారి ఫస్ట్ పేరు శ్రీనివాస్... అది మా ఆయన పేరు చివరన చేరుతోంది. మావారు... ఆనంద్. అది నా ఇంటి పేరు అవ్వాలి’ అని చెప్పుకొచ్చింది. వెంటనే ఆలీ..‘మరి మంచు అని తీసేసి.. ఆనంద్ లక్ష్మీ ప్రసన్న అని పెట్టుకోవచ్చుగా’ అని కాస్త మోహం వెటకారంగా పెట్టుకొని అడగడంతో... లక్ష్మీ..‘బాలేదు కదా! చూసారా.. మీరే ఫేస్ ఏదోలా పెట్టేస్తున్నారు. అయినా మంచు కొంచెం చల్లగా వుంటుంది కదా. అందుకే ఆ పేరుతోనే కంటిన్యూ అయిపోదామని అలా పెట్టుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

మంచు లక్ష్మీ పేరుకు మంచు ఎందుకో తెలుసా? Click here

Samantha At Enakkul Oruvan Audio Launch

Samantha At Enakkul Oruvan Audio Launch

అక్కడ సిద్ధుతో సమంత ఒకటే ఇకఇకలు

Samantha at enakkul oruvan audio launch

టాలీవుడ్ హీరోయిన్ Samantha, నటుడు సిద్ధార్థ్ ల మధ్య ప్రేమాయణం నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ నుంచి సిద్ధుని బహిష్కరించడంతో తెలుగులో సినిమాలు చేయకుండా కేవలం తమిళంలోనే సినిమాలు చేస్తూ, కాలం గడిపేస్తున్నాడు.

తమిళంలో ఈ అమ్మడికి కలిసి రావడంలేదు... ఆ బాబుకి తెలుగులో ఎంట్రీ లేదు. దీంతో సిద్ధు, సమంతలు కలుసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. అయితే ఈ మధ్య సిద్ధార్థ్ తమిళంలో నటించిన ‘జిగర్తండా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో ఫుల్ జోష్ మీదున్నాడు. తాజాగా కన్నడంలో విజయం సాధించిన ‘లూసియా’ చిత్రాన్ని తమిళంలో ‘ఎన్నక్కుల్ ఒరువన్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తన ప్రేయసి సమంతను ఆహ్వానించాడు. సమంత వచ్చిన ఆ కార్యక్రమంలో... అబ్బో.. వీరిద్దరు తెగ సందడి చేసారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ.. ఆ వేడుకను బాగానే ఎంజాయ్ చేసారు.

అయితే ఈ కార్యక్రమంలో సిద్ధు మాట్లాడుతూ... ‘కన్నడ చిత్రం ‘లూసియా’ చూశాక చాలా సంతృప్తి కలిగింది. ఎలాగైనా ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోవాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే సీవీ కుమార్ హక్కులు తీసుకొన్నాడని తెలిసింది. ఆయనకు ఫోన్ చేసి ‘సినిమాలో నేను నటిస్తాను, ఎలాగైనా నాతో తీయండి’ అని అడుక్కొన్నాను. ఆయన మాత్రం ‘అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన పనిలేదు’ అంటూ హ్యాపీగా అవకాశం ఇచ్చేసాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Rakul Preet Singh For Kick 2 Movie

Rakul Preet Singh For Kick 2 Movie

రవితేజ కిక్ సరసన రకూల్ భామ

Rakul preet singh for kick 2 movie

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ Rakul Preet Singh ఈ మధ్య వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మనోజ్, గోపిచంద్ సినిమాలతో బిజీగా వుంది. అయితే తాజాగా మరో భారీ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్లుగా తెలిసింది. రవితేజ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్2’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో Ravi Teja సరసన హీరోయిన్ గా తమన్నా నటించబోతుందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఇందులో హీరోయిన్ గా మరో భామ పేరు వినిపిస్తోంది. ఆవిడే రకూల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడిని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తాజా సమాచారం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ మాటలు రాస్తున్నాడు.

ప్రస్తుతం రవితేజ నటించిన ‘పవర్’ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలకు భారీ స్పందన వస్తోంది. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

Shilpa Shetty Crying After Watching Meri Kom

Shilpa Shetty Crying After Watching Meri Kom

ప్రియాంకను చూసి ఏడ్చేసిన శిల్పాశెట్టి

Shilpa shetty crying after watching meri kom

Priyanka Chopra  నటించిన ‘మేరీకోమ్’ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను అన్ని సినిమాల వలే సమానంగా చూడాలని, లేడీ ఓరియేంటెడ్ చిత్రమంటూ వేరు చేయవద్దని ప్రియాంక ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన క్షణం నుంచి మంచి స్పందనను సొంతం చేసుకొంటోంది.

ముఖ్యంగా మహిళా ప్రేక్షకాదరణ ఈ సినిమాకు మరింత ఎక్కువగా వుంది. దీంతో సినిమాకు భారీ పబ్లిసిటీ అవుతోంది. ఇందులో ప్రియాంక అద్భుతంగా నటించిందని అందరూ చెబుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చూసి ఏడ్చానంటుంది బాలీవుడ్ భామ శిల్పాశెట్టి.

అవును ఇటీవలే ‘మేరీ కోమ్’ చిత్రాన్ని శిల్పా చూసిందిట. ప్రియాంక నటన చూసి ఉద్వేగానికి లోనై ఏడ్చేసినట్టు ట్విట్ చేసింది. ‘మేరీ కోమ్ సినిమా చూశాను. ప్రియాంక అద్భుతంగా నటించింది. ఒమంగ్ దర్శకత్వం చాలా బాగుంది. ఈ సినిమా చూసి కంటతడి పెట్టుకున్నాను. మేరీ కోమ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా’ అని ట్విట్ చేసింది శిల్పా శెట్టి.

Shilpa Shetty  ట్వీట్ ఏమో గానీ... ఈ సినిమా మాత్రం మహిళా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వున్న సమాజంలో ఇలాంటి సినిమాల ద్వారా తమని తాము ఎలా రక్షించుకోవాలో, మానసికంగా ఎలా వుండాలో, ఎలాంటి పరిస్థితులనైనా ఎలా ఎదుర్కొనాలో ‘మేరీ కోమ్’ సినిమాలో ప్రియాంక చోప్రా అద్భుతంగా నటించింది. ఈ సినిమా కలెక్షన్ల విషయం పక్కన పెడితే.. అవార్డులు మాత్రం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం... ఏం జరుగనుందో.

Tuesday 9 September 2014

Hansika Prises Raviteja

Hansika Motwani Prises Raviteja

హన్సిక మోసేస్తుందిరా బాబోయ్...!

Hansika prises raviteja

ఏదేనా సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే... ఆ సినిమా గురించి భారీగా పబ్లిసిటీ చేయడం ప్రస్తుతం ప్రతీ ఇండస్ట్రీలో సర్వసాధారణం అయిపోయింది. ఆ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర యూనిట్ అంతా కూడా ఏదో ఒక రకంగా సినిమా గురించి ప్రమోట్ చేస్తూనే వుంటారు. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని సినిమాల గురించి ‘సినిమా అద్భుతంగా వచ్చింది.. వాళ్లు ఇలా చేసారు.. వీళ్లు ఇలా చేసారు. వాళ్లు అద్భుతంగా చేసారు. సంగీతం సిరిగిపోయింది’ అంటూ ఏదో ఒకరకంగా డబ్బాలు కొడుతూనే వుంటారు. అయితే తాజాగా అలాంటి పనే హీరోయిన్ హన్సిక కూడా చేస్తోంది.

ప్రస్తుతం Raviteja హీరోగా రెజీనా, Hansika Motwani హీరోయిన్లుగా నటించిన ‘పవర్’ సినిమా ఈనెల 12న విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ కు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమాపై ఎక్కడలేనంత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ చిత్ర యూనిట్ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ, సినిమాను బాగానే పబ్లిసిటీ చేస్తున్నారు. తాజాగా హన్సిక కూడా ఈ సినిమా గురించి ప్రమోట్ చేసే పనిలో పడింది.

ఇటీవలే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక హీరో రవితేజను ఆకాశానికి ఎత్తేసింది. మాస్ మహారాజను పొగడ్తలతో ముంచెత్తింది. వయసులో దాదాపు 20 సంవత్సరాలు పెద్దవాడైన రవితేజతో రొమాన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదా? అనే ప్రశ్నకు హన్సిక సమాధానమిస్తూ.... రవితేజ తనకన్నా రెండు పదుల వయసు పెద్దవాడైనా కూడా... తాను రవితేజతో నటిస్తున్నప్పుడు 25 ఏళ్ల యంగ్ హీరోతో నటించిన ఫీలింగ్ కలిగిందని నటనలో, డాన్స్ లలో నేటి యంగ్ హీరోలతో సమానంగా రవితేజ నిలవగలడని అంటూ మాస్ మహరాజను పొగడ్తలతో ముంచెత్తింది.

hansika prises raviteja-02

అయితే ఈ అమ్మడికి ప్రస్తుతం ఈ ‘పవర్’ సినిమా తప్ప మరో సినిమాలేవి. ఈ సినిమాకు ముందు తెలుగులో నాలుగైదు సినిమాలు అంగీకరించినా కూడా ఆ సినిమాలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడానికే హన్సిక ఇలా మాస్ మహరాజాను పొగిడేస్తుందంటూ టాలీవుడ్ లో ఈ అమ్మడిపై కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా కూడా రవితేజ మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. తను నటించిన ‘పవర్’ సినిమాపై రవితేజ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్టయ్యితే టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. చూద్దాం... మరి మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో.

Monday 8 September 2014

Mahesh Babu In 100 Crores Budget Film

Mahesh Babu In 100 Crores Budget Film

మహేష్ తో 100 కోట్ల బడ్జెట్ సినిమా?

Mahesh babu in 100 crores budget film

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్5 భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ గా పేరుతెచ్చుకున్న 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ ‘దూకుడు’ సినిమాతో టాప్ స్థానాన్ని సొంతం చేసుకుంది. మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ ఇక వెనక్కితిరిగి చూడలేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థలో ఒకటిగా చేరిపోయింది.

‘దూకుడు’ తర్వాత మహేష్ తో ‘1 నేనొక్కడినే’ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే తాజాగా మళ్లీ Mahesh Babu తో కలిసి ‘ఆగడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే మహేష్ నటించిన ‘దూకుడు’ చిత్రాన్ని కన్నడంలో ‘పవర్’ పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో మహేష్ తో 14రీల్స్ కు లక్కు బాగానే కలిసొచ్చింది. దీంతో తాజాగా మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని మహేష్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు 14 రీల్స్ సంస్థ వారు.

14 రీల్స్ వారు Mahesh Babu తో 100కోట్ల సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ 14 రీల్స్ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం వారు మహేష్ తో 100కోట్ల సినిమా తీయడానికి సిద్దంగానే ఉన్నారు కానీ అంతటి బడ్జెట్ ను తిరిగి రాబట్టగలిగే దర్శకుడితోనే ఈ చిత్రం నిర్మించే ఆలోచనలు వున్నట్లుగా తెలిసింది. అయితే ఆ దర్శకుడు ఎవరూ అనేది త్వరలోనే తెలియనుంది.

ఎందుకంటే ప్రస్తుతం 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ‘ఆగడు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనున్నారు. మరి ఈ 100 కోట్ల బడ్జెట్ చిత్రం గురించి త్వరలోనే తెలియనుంది.

Ileana Signed Opposite Shahrukh

Ileana Signed Opposite Shahrukh

Ileana signed opposite shahrukh

‘దేవదాస్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ Ileana ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా స్థానాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఈమధ్య ఇలియానా నటించిన తెలుగు చిత్రాలు ఫ్లాప్ అవుతుండటంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో ఇలియానా నటించిన చిత్రాలు విడుదలయ్యి విజయాలు సాధిస్తుండటంతో అక్కడికే మకాం మార్చేసింది.

దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ అడపదడపా అప్పుడప్పుడు సినిమా ఆఫర్లు వస్తూనే వున్నాయి. హిందీలో Ileana నటించిన ‘బర్ఫీ’ చిత్రం నటిగా మంచి పేరును తెచ్చిపెట్టింది. బాలీవుడ్ లో ఎంత మంది హీరోలతో నటించినా కూడా షారుక్, సల్మాన్, అమీర్ లతో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. అయితే తాజాగా అలాంటి ఓ భారీ ఆఫర్ ఈ అమ్మడికి వరించినట్లుగా తెలిసింది.

తాజాగా షారుక్ ఖాన్ నటించబోయే ఓ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. షారుక్ నటించబోయే తర్వాతీ చిత్రం ‘ఫ్యాన్’. ఈ సినిమా కోసం ముందుగా షారుఖ్ కి జోడీగా వాణి కపూర్, పరిణీతి చోప్రా లను పరిశీలించారు కానీ తాజాగా ఈ అవకాశం ఇలియానాకి వెళ్లిందని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రానుంది.

షారుక్ ఖాన్ ప్రస్తుతం ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఫరాఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇందులో దీపికా పదుకునే, అభిషేక్ బచ్చన్ లతో పాటుగా పలువురు ప్రధాన తారాగణం నటిస్తున్నారు.

Ice Cream 2 Kiss Mix Song

Ice Cream 2 Kiss Mix Song

ఐస్ క్రీంకు మసాలా కిస్ మిక్స్

Ice cream 2 kiss mix song

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఐస్ క్రీం2’సినిమాలో నవీన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం నవీనతో ఓ హాట్ హాట్ ఫోటోషూట్ చేయించి విడుదల చేసాడు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన నవీన మీద చిత్రీకరించిన ‘కిస్ మీ ఎవ్రీవేర్’ సాంగ్ ఇటీవలే విడుదల చేసారు. ఆ సాంగ్ హాట్ హాట్ గా అదరగొడుతుంది. అయితే ఈ పాటకు ఇంకాస్త మసాలా జోడించి ‘కిస్ మిక్స్’ సాంగ్ ను విడుదల చేయనున్నారు. Ice Cream 2 heroine naveena

Ice Cream 2 Kiss Mix Song-02

Friday 5 September 2014

Nayanthara Slaps Udhayanidhi Stalin

Nayanthara Slaps Udhayanidhi Stalin

ఆ హీరోను నయనతార గోళ్లతో రక్కేసిందట

Nayanthara slaps udhayanidhi stalin

తమిళ టాప్1 స్టార్ హీరోయిన్ నయనతారతో తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రేమలో పడిపోయాడనీ, ఆమెకు తన ప్రేమ విషయం చెబితే నిరాకరించిందనీ... అందువల్ల ఉదయనిధి ఆత్మహత్యకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలొచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే అవన్నీ కేవలం పుకార్లేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఇటీవలే ఉదయనిధి వివరణ ఇచ్చుకున్నాడు.

ఉదయనిధి స్టాలిన్, Nayanthara జంటగా కలిసి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నన్బెండా’. అయితే తాజాగా ఉదయనిధిని నయనతార గోళ్లతో కసిగా రక్కేసిందట. అది చూసి సెట్ లో వున్నవాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారట. ఇక చేసేదేంలేక వెంటనే హాస్పిటల్ కు పరిగెత్తాడట స్టాలిన్. అయితే ఈ విషయంపై స్టాలిన్ ఇలా చెప్పుకొచ్చాడు.

నిజానికి ఏమయ్యిందంటే... ‘ఒక షాట్ లో నేనూ, నయనతార కిందపడి దొర్లుతూ వెళ్లాలి. ఆ తర్వాత నయనతార లేచి అక్కడున్న విలన్ చెంపని చెళ్లుమనిపించాలి. అయితే ఆ విషయాన్ని మరిచిపోయిన నయనతార నన్నే చెంపపై కొట్టింది. ఆ దెబ్బ కాస్త నా కంటికి పడింది. నయనతార చేతిగోళ్లు నా కనురెప్పపై రక్కేసినట్లుగా తగలడంతో కాస్త గాయం అయ్యింది. దీంతో వెంటనే హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చింది. జరిగిన సంఘటన ఇది. నిజాలు తెలుసుకోకుండా ఏదేదో పుకార్లు అల్లేస్తున్నారు’ అంటూ నవ్వుకుంటూ చెప్పుకొచ్చాడు స్టాలిన్.

సినిమా షూటింగ్ లోనే ఇంత సరదా సరదాగా రొమాంటిక్ ఫైటింగులు చేస్తుంటే... ఇక సినిమాలో ఇంకెంత చేసుంటారోనని కోలీవుడ్ జనాలు గుసగుసలు పెడుతున్నాయి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shweta Basu Prasad Caught In A Prostitution Racket

Shweta Basu Prasad Caught In A Prostitution Racket

శ్వేతా బాబులకు ముచ్చెమటలు పడుతున్నాయా?

Shweta prasad caught in a prostitution racket

మొన్నటి వరకు శృంగార తార, సెక్సీ షకీలా తన జీవితకథను రాస్తుందని తెలిసి సౌత్ ఇండస్ట్రీ మొత్తం వణికిపోయింది. ఈ అమ్మడితో చాలా మంది పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు, రాజకీయ నాయకులు రాసలీలలు నడిపారని సౌత్ ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. అయితే తన జీవితకథలో తమ గురించి ఎక్కడ బయటపెడుతుందోనని భయపడిపోయారు. కానీ వారి పేర్లు మాత్రం చెప్పకుండా వాళ్లందరికి ఓ రెండు, మూడు నెలలు నిద్రల్లేని రాత్రులు గడిపేలా చేసేసింది షకీలా.

షకీలా సైలెంట్ అయ్యిందని అందరూ అనుకుంటే... ఆ స్థానాన్ని Shweta Basu Prasad ఆక్రమించేసింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది శ్వేతాబసు ప్రసాద్. శ్వేతా ఇటీవలే వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యభిచారంలో పట్టుబడ్డ తర్వాత శ్వేతా పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ అమ్మడితో సంబంధం వున్న బఢా బాబులకు ముచ్చెమటలు పట్టేలా చేస్తోంది.

శ్వేతా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస ఆఫర్లు రావాలంటే వ్యభిచారం చేస్తేనే సినిమా అవకాశాలు వస్తాయంటూ ఈ అమ్మడిని కొంతమంది వ్యభిచారం చేయమని ప్రోత్సహించారట. అంతే కాకుండా ఎన్ని స్టేజ్ షోలు చేసినా కూడా ఎవరికి దక్కని ఆఫర్లు వ్యభిచారం చేస్తేనే వస్తాయని ఈ అమ్మడిని ప్రోత్సాహించారని తెలిసింది. అయితే సినిమా తారల్లో ఇంకా చాలా మంది సినీ తారలు, అమ్మాయిలతో పాటుగా స్టార్ హీరోయిన్లు కూడా ఈ వ్యభిచార కూపంలో వున్నారని శ్వేతా తెలిపినట్లుగా సమాచారం.

అయితే ఆ స్టార్ హీరోయిన్, సినీతారలు ఎవరు? ఈ అమ్మడిని ప్రోత్సాహించిన ఆ దర్శక, నిర్మాతలు ఎవరు? అసలు శ్వేతా ఈ వ్యభిచార కూపంలోకి దిగడానికి గల కారణాలేంటో త్వరలోనే తెలియనున్నాయి. మరి ఈ వార్తలన్నీ కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై శ్వేతా అధికారికంగా మీడియా ముందుకొచ్చి ఎప్పుడు, ఏం చెప్పనుందోనని టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది.

Parineeti Chopra Dating A New Guy

Parineeti Chopra Dating A New Guy

చిన్నవాడితోనైనా డేటింగ్ చేస్తానంటున్న పరిణితీ

Parineeti chopra dating a new guy

బాలీవుడ్ లో డేటింగులు, రొమాన్సులు, కిస్సింగులు, బ్రేకప్ లు.... ఇలాంటివన్నీ కూడా చాలా కామాన్. ఈ డేటింగ్ అనేది సినీతారల్లో మరింత ఎక్కువ అనే విషయం అందరికి తెలిసిందే. కొంతకాలం డేటింగ్ చేసేసి, ఆ తర్వాత నచ్చట్లేదని బ్రేకప్ చెప్పేసుకొని విడిపోతుంటారు. కానీ బాలీవుడ్ యువ హీరోయిన్, సెక్సీ భామ Parineeti Chopra మాత్రం అందుకు విరుద్ధం అని చెబుతోంది.

‘ఇశక్ జాదే’ చిత్రంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడికి ప్రస్తుతం డేటింగ్ విధానంపైన ఓ అభిప్రాయముంది. తనకు ఎలాంటి వాడితో డేటింగ్ చేయాలని వుందో చాలా చక్కగా చెప్పుకొచ్చింది. మరి పరిణితీ ఏం అన్నదో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా!

‘నేను ప్రేమలో పడాలంటే ఆ కుర్రాడు మానసికంగా చాలా దృఢమైనవాడిగా ఉండాలి. నాకు పిరికివాళ్లు నచ్చరు. అమాయకంగా ఉండేవార్ని అస్సలు ప్రేమించను. ఎంతో తెలివిగా, మానసికంగా చాలా పరిణతి ఉన్న అబ్బాయినే ప్రేమిస్తాను. అలాంటి అబ్బాయికి ఇరవయ్యేళ్ల వయసే అయినా సరే.. నాకు ప్రాబ్లమ్ లేదు. అతనితో డేటింగ్ చేసేస్తా.

ప్రేమ పేరుతో ఒకరిని... డేటింగ్ కోసం మరొకరిని సెలక్ట్ చేసుకునే అమ్మాయిని కాదు నేను. నేను ఎవర్ని ప్రేమిస్తానో వారితోనే డేటింగ్ చేస్తా.... నా మిగతా జీవితం అతనితో గడిపితే బాగుంటుందనే నమ్మకం కుదిరితే, అతడినే పెళ్లి కూడా చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇక ఈ అమ్మడిని ప్రేమలో పడేయటానికి చాలా మంది సిద్ధమైపోతున్నారు. మరి ఈ అమ్మడికి ఎవరు డేటింగ్ హీరో అవుతారో త్వరలోనే తెలియనుంది.

Rakul Preet Singh Tweets On Her Dance

Rakul Preet Singh Tweets On Her Dance

ఆ పాటలో ఈ అమ్మడు చింపేసిందట

Rakul preet singh tweets on her dance

ఆది, Rakul Preet Singh జంటగా నటిస్తున్న చిత్రం ‘రఫ్’. సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమాలోని చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాటలో రకూల్ డాన్స్ చింపేసిందట. ఈ మాట ఎవరో చెప్పలేదు. స్వయంగా రకూలే చెప్పుకొచ్చింది.

‘రఫ్’ సినిమాలోని ఒక పాట కోసం సాలిడ్ డాన్స్ చేస్తున్నాను. స్టెప్స్ చాలా బాగుంటాయి. ఇప్పటివరకు నేను మాక్సిమం డాన్స్ చేసింది ఈపాట కోసమే. ఐ లవ్ దిస్ సాంగ్ అంటూ రకూల్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. మరి తను చెప్పినట్లుగా ఈ సినిమాలోని ఏ పాటలో రకూల్ తన డాన్స్ ఇరగదీసిందో తెలుసుకోవాలంటే ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

‘ప్యార్ మే పడిపోయానే’ వంటి ఫ్లాప్ చిత్రం తర్వాత వస్తున్న ఈ ‘రఫ్’ చిత్రంతో ఎలాగైనా విజయం సాధించాలని ఆది చాలా కసిగా వున్నాడు. ఇదిలా వుంటే ఆదాశర్మతో కలిసి ఆది ‘గరం’ అనే చిత్రం తాజాగా మొదలుపెట్టాడు. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నిన్న ఘనంగా జరిగాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ‘రఫ్’ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Thursday 4 September 2014

Mek Spoof In Mahesh Babu Aagadu

Mek Spoof In Mahesh Babu Aagadu
 
నాగార్జునను మళ్లీ మహేష్ వాడేసుకున్నాడట!
 
Mek spoof in mahesh babu aagadu

మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ సినిమా విజయం సాధించడానికి మహేష్ ఎంత వరకు కారణమో, హాస్య నటులు బ్రహ్మనందం, ఎమ్మెస్ నారాయణల కామెడీ కూడా అంతే కారణం. ఈ సినిమాలో ఎమ్మెస్ తో పలు హీరోలను ఇమిటేట్ చేయడం, బ్రహ్మనందంతో ఎస్సెమ్మెస్ అడిగించడం వంటి పలు కామెడీ సన్నీవేశాల వల్ల, అలాగే నాగార్జునను కూడా బాగానే వాడుకోవడం వల్ల ఆ సినిమా మరింత హిట్టయ్యింది.

అయితే మళ్లీ శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్లో ‘ఆగడు’ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లు, పాటలకు మంచి స్పందన వస్తోంది. అయితే ‘దూకుడు’ సినిమాలో నాగార్జునను వాడుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజా ‘ఆగడు’ సినిమాలో కూడా నాగార్జునను వాడుకున్నట్లుగా తెలిసింది. ఇటీవలే నాగార్జున వ్యాఖ్యతగా చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఇపుడు ఇదే కార్యక్రమాన్ని ‘ఆగడు’ సినిమాలో స్పూఫ్ గా తీసారని తెలిసింది. అయితే ఇది ఎవరిని కించపరిచే విధంగా కాదని, కేవలం నవ్వించడానికేనని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘అంత్యాక్షరి’ కార్యక్రమం చేసినట్లుగా... ‘ఆగడు’ సినిమాలో కూడా మహేష్ తన పోలీస్ స్టేషన్ లో ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ స్పూఫ్ చిత్రీకరించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నారు.

Trisha Krishnan Has A Tattoo In A Secret Place

Trisha Krishnan Has A Tattoo In A Secret Place

తొడలపై, నడుముపై అబ్బో ఒకటే గోల

Trisha krishnan has a tattoo in a secret place

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న అగ్ర హీరోయిన్ Trisha Krishnan ఇప్పటివరకు చాలా మంది అగ్ర, యువ హీరోలందరితో కలిసి నటించిన విషయం తెలిసిందే. తెలుగులో ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో టాప్ 1 హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తూ, అక్కడ కూడా దూసుకెళ్ళింది. అయితే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి సరైన విజయం అందకపోవడంతో సౌత్ ఇండస్ట్రీనే నమ్ముకొని, సౌత్ సినిమాలను మాత్రమే చేస్తూ వస్తోంది.

Trisha Krishnan Has A Tattoo In A Secret Place-02

ఇప్పటివరకు త్రిష చాలా రకాల పాత్రల్లో నటించింది కానీ... ఏనాడు కూడా బికినీ వేసింది లేదు. గ్లామర్ పరంగా చాలా సినిమాల్లో అందాల ప్రదర్శన చేసినా కూడా మితిమీరిన అందాల ప్రదర్శన మాత్రం ఏనాడు చేయలేదు. అయితే తాజాగా ఈ అమ్మడికి టాటూల పిచ్చి బాగా పట్టుకొంది. ఒళ్లంతా టాటూలతో నింపేసుకుంటుంది.

Trisha Krishnan Has A Tattoo In A Secret Place-03

ఆ టాటూలన్నీ కూడా రకరకాలుగా కాకుండా ఒకే రకం త్రిష టాటూతో ఒళ్లంతా పొడిపొంచేసుకుంటోంది. కావాలంటే మీరు చూడండి. ఇలా టాటూలు పొడిపించుకోవడమే కాకుండా ఆ ఫోటోలను నెట్ లోకి వదిలేసింది. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సౌత్ లో హాట్ టాపిక్ గా మారాయి. సెక్సీ సెక్సీ ఫోజులతో త్రిష అలా టాటూలు వేయించుకుంటే కుర్రకారులు పిచ్చేక్కిపోతున్నారు. ఈ ఫోటోలతో త్రిషకు మరిన్ని సినీ అవకాశాలు వచ్చే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది.

Trisha Krishnan Has A Tattoo In A Secret Place-04

Trisha Krishnan Has A Tattoo In A Secret Place-05

Swetha Basu Sensation Statement On Prostitution Entry

Swetha Basu Sensation Statement On Prostitution Entry

పైసలకోసమే శ్వేతా ఈ వ్యభిచారం చేసిందట!


Swetha basu sensation statement on prostitution entry

‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బొద్దుగుమ్మ శ్వేతాబసు ప్రసాద్ కు ఆ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా విజయం తర్వాత వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ శ్వేతాకు సరైన విజయం దొరకలేదు. దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత ఐటెం సాంగులు, స్టేజ్ షోలు చేస్తూ ఏదో చిన్న చిన్న ఆఫర్లు దక్కించుకుంటూ వెళుతోంది.

ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు ఎప్పుడూ తగ్గుతూ వచ్చాయో... అప్పటి నుంచే సెక్సీ ఆఫర్లు పెరుగుతూ వచ్చాయంట. అలాంటి శ్వేతా ఇటీవలే వ్యభిచార కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే తాను కావాలనే ఈ వ్యభిచార కూపంలోకి దిగినట్లుగా శ్వేతా చెప్పినట్లుగా సమాచారం. సినిమా ఇండస్ర్టీలో అవకాశాలు రాకపోవడంతో ఇటువైపు వెళ్తే మనీ సంపాదించవచ్చునంటూ కొందరు తనను ఈ వ్యభిచారం వైపు ప్రొత్సహించారంటూ వాపోయింది. ఆర్థిక ఇబ్బందుల వల్లనే తానే ఈ వ్యభిచార కూపంలోకి దిగానని, కొన్ని పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలతో తన కెరీర్ ఇబ్బందుల్లో కూరుకుపోయినందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వ్యభిచార కూపంలో తానొక్కతే వున్నట్లుగా చూపిస్తోంది మీడియా. కానీ ఈ వ్యభిచార కూపంలో ఇంకా చాలా మంది నటీమణులున్నారని, చాలామంది హీరోయిన్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని బయటపెట్టింది. తన సమస్యలపై ఎవరు అర్థం చేసుకోకుండా తనపై అనవసరంగా అభాండాలు వేస్తున్నారంటూ ఓ రిపోర్టర్ ముందు కన్నీటి పర్యంతమైంది. మాది ట్రెడిషన్ ఫ్యామిలీ అని చెబుతూనే ఫిల్మ్ కెరీర్‌ని ఎంచుకుని చాలా తప్పుచేశానంటూ తన గోడును వెళ్లబోసుకుంది.

కానీ వ్యభిచారం కేసులో దొరికిపోయి, పునరావాస కేంద్రంలోవున్నా ఆమెలో ఎలాంటి దిగులు కనిపించడంలేదని అక్కడి సిబ్బంది చెప్పుకుంటున్నారు. అంతేకాదు రీసెంట్‌గా ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన ఆమె, ట్వీట్లతో కాలం గడిపేస్తోంది. బాలీవుడ్ ఫిల్మ్ గురించి ఎక్కువగా అందులో ప్రస్తావిస్తోంది. పక్కనున్న వారితో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తోందని అంటున్నారు. మరి ఈ అమ్మడు ఆ మిగతా హీరోయిన్ల గురించి, తనను ఈ వ్యభిచార కూపంలోకి దింపిన భడా బాబుల గురించి త్వరలోనే బయటపెడుతుందో లేక ఈ పనే బాగుందని సైలెంట్ గా వుండిపోతుందో త్వరలోనే తెలియనుంది.