Friday 5 September 2014

Nayanthara Slaps Udhayanidhi Stalin

Nayanthara Slaps Udhayanidhi Stalin

ఆ హీరోను నయనతార గోళ్లతో రక్కేసిందట

Nayanthara slaps udhayanidhi stalin

తమిళ టాప్1 స్టార్ హీరోయిన్ నయనతారతో తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రేమలో పడిపోయాడనీ, ఆమెకు తన ప్రేమ విషయం చెబితే నిరాకరించిందనీ... అందువల్ల ఉదయనిధి ఆత్మహత్యకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలొచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే అవన్నీ కేవలం పుకార్లేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఇటీవలే ఉదయనిధి వివరణ ఇచ్చుకున్నాడు.

ఉదయనిధి స్టాలిన్, Nayanthara జంటగా కలిసి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నన్బెండా’. అయితే తాజాగా ఉదయనిధిని నయనతార గోళ్లతో కసిగా రక్కేసిందట. అది చూసి సెట్ లో వున్నవాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారట. ఇక చేసేదేంలేక వెంటనే హాస్పిటల్ కు పరిగెత్తాడట స్టాలిన్. అయితే ఈ విషయంపై స్టాలిన్ ఇలా చెప్పుకొచ్చాడు.

నిజానికి ఏమయ్యిందంటే... ‘ఒక షాట్ లో నేనూ, నయనతార కిందపడి దొర్లుతూ వెళ్లాలి. ఆ తర్వాత నయనతార లేచి అక్కడున్న విలన్ చెంపని చెళ్లుమనిపించాలి. అయితే ఆ విషయాన్ని మరిచిపోయిన నయనతార నన్నే చెంపపై కొట్టింది. ఆ దెబ్బ కాస్త నా కంటికి పడింది. నయనతార చేతిగోళ్లు నా కనురెప్పపై రక్కేసినట్లుగా తగలడంతో కాస్త గాయం అయ్యింది. దీంతో వెంటనే హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చింది. జరిగిన సంఘటన ఇది. నిజాలు తెలుసుకోకుండా ఏదేదో పుకార్లు అల్లేస్తున్నారు’ అంటూ నవ్వుకుంటూ చెప్పుకొచ్చాడు స్టాలిన్.

సినిమా షూటింగ్ లోనే ఇంత సరదా సరదాగా రొమాంటిక్ ఫైటింగులు చేస్తుంటే... ఇక సినిమాలో ఇంకెంత చేసుంటారోనని కోలీవుడ్ జనాలు గుసగుసలు పెడుతున్నాయి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment