Tuesday 3 February 2015

Raviteja Dance In Kannada Vajrakaya Movie

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘వజ్రకాయ’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రవితేజ ఓ గెస్ట్ రోల్ లో నటించాడు. ఇటీవలే జరిగిన ఓ సాంగ్ లో రవితేజ పాల్గొన్నాడు. ఈ పాటలో హీరో శివరాజ్ తో కలిసి రవితేజ కాలుకదిపాడు. అంతే కాకుండా ఈ చిత్ర ప్రెస్ మీట్ లో రవితేజ పాల్గొని, సినిమాను ప్రమోట్ చేసాడు.


ఈ సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రవితేజ పాల్గొనగా... సౌత్ సినీ ఇండస్ట్రీల నుంచి ఒక్కొక్క స్టార్ హీరో ఈ పాటలో పాల్గొన్నారు. తమిళం నుంచి శివకార్తికేయన్, మలయాళం నుంచి దిలీప్, కన్నడ స్టార్ రవిచంద్రన్ లు కూడా ఈ పాటలో శివరాజ్ తో స్టెప్పులేసారు. ఈ పాటను తమిళ హీరో ధనుష్ పాడినట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- See more at: http://www.cinewishesh.com/cine-world/704-cine-buzz/53612-raviteja-dance-in-kannada-vajrakaya-movie.html

No comments:

Post a Comment