Tuesday 3 February 2015

Ram New Movie Title Shivam Shivoham

మహేష్ బాబు హీరోగా ‘శివం’ అనే సినిమా రూపొందనుందని గతకొద్ది కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ ప్రాజెక్టు ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. అయితే ఈ చిత్ర టైటిల్ ను హీరో రామ్ తన కొత్త సినిమా కోసం తీసేసుకున్నాడని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. రామ్ హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది.


ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఈ చిత్రానికి 'శివం' అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం... ఈ చిత్రానికి ‘శివం.. శివోహం అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఇటీవలే ఈ టైటిల్ ను శ్రీ స్రవంతి మూవీస్ వారు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఇందులో రాశిఖన్నా హీరోయిన్ గా ఎంపిక చేసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

- See more at: http://www.cinewishesh.com/hot-gossips/244-hot-gossips/53614-ram-new-movie-title-shivam-shivoham.html

No comments:

Post a Comment