Thursday 11 December 2014

Super Star Rajinikanth Movie Lingaa Hit - Lingaa Review Updates By Cinewishesh

cinima-reviews
 తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, అనుష్క, సోనాక్షీ సిన్హా కలిసి నటించిన తాజా చిత్రం ‘లింగా’. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా నేడు (డిసెంబర్ 12) ‘లింగ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసారు. మరి భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్రం ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Lingaa Telugu Movie Updates and Ratings Click Here


 ప్లస్ పాయింట్స్ :
 ‘లింగ’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమా మొత్తం రజనీ తన నటనతో అదరగొట్టాడు. స్టైల్, యాక్షన్, డాన్స్ చింపేసాడు. వయసు ప్రభావం కనిపించకుండా అపుడెప్పుడో వచ్చిన ‘అరుణాచలం’ సినిమాలోని రజనీని చూసినట్లుగా చాలా యంగ్ గా కనిపించాడు. ఇక నటుడు జగపతి బాబు తన పాత్రకు వందశాతం న్యాయం చేసాడు. ఇక రజనీతో తొలిసారిగా జతకడుతున్న అనుష్క తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. గ్లామర్ పాత్రలో అందరిని ఆకట్టుకుంది. అలాగే ‘లింగ’తో సౌత్ కు ఎంట్రీ ఇస్తున్న సోనాక్షి సిన్హా పల్లెటూరి అమ్మాయిగా బాగా నటించింది. ముఖ్యంగా ఇందులో తను మాట్లాడే విధానం జనాలను బాగా ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు.
  మైనస్ పాయింట్స్ :
 ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్లు అంటూ ఏం లేవు కానీ.... భారీ అంచనాలతో విడుదలవ్వడంతో ప్రేక్షకులు భారీగా ఊహించేసుకున్నారు. గతంలో రజనీకాంత్ లో వున్న స్టైల్ ఈ సినిమాలో కాస్త తగ్గింది. అలాగే అనుష్కతో రజనీ చేసే రొమాంటిక్ సన్నీవేశాలు మరియు జగపతి బాబు పాత్రను సరిగ్గా చూపించలేకపోయారు. ఇక సంతానం, బ్రహ్మనందం వంటి స్టార్ కమెడియన్లు వున్నా కూడా కామెడీ అనుకున్న రేంజులో లేకపోయింది.

  సాంకేతిక వర్గ పనితీరు:
 ఈ సినిమాకు నలుగురు మేజర్ ప్లస్ పాయింట్స్ గా తీసుకోవచ్చు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, నిర్మాత. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మరోసారి రజినీతో ఓ అద్భుతమైన చిత్రాన్ని తీసి తానేంటో నిరూపించుకున్నాడు. కాకపోతే కథతో పాటు ఫ్యాన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడంతో కాస్త అక్కడక్కడ కాస్త క్లారిటీ మిస్సయ్యింది. ఇక ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. రజినీతో పాటుగా మిగతా అందరూ ఆర్టిస్టులను అద్భుతంగా చూపించడమే కాకుండా... విజువల్స్ అన్ని కూడా చాలా గ్రాండ్ గా చూపించాడు. కొన్ని కొన్ని సన్నివేశాలలో అద్భుతంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి కొన్ని సన్నీవేశాలు సూపర్బ్. ఇక రజనీని యంగ్ గా చూపించడంలో రత్నవేలు వందకు వంద మార్కులు కొట్టేసాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. రెహమాన్ అందించిన పాటలకు ముందుగా అంతగా ఆదరణ లభించకపోయినప్పటికీ... సినిమాలో విజువల్స్ తో పాటు చూస్తుంటే ప్రతి పాట బాగుంది. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అందించాడు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్... నిర్మాత రాక్ లైన్ వెంకటేష్. రజినీతో సినిమా అంటే ఎంత గ్రాండ్ గా వుండాలో అంత కంటే పదిరేట్లు గ్రాండ్ గా నిర్మించాడు. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా అద్భుతంగా నిర్మించాడు.

చివరగా: లింగ: రజనీ అభిమానులకు పండగే.


 The Article of Original Source at http://www.cinewishesh.com/movie-film-reviews/200-movie-film-reviews/53157-lingaa-telugu-movie-review.html

No comments:

Post a Comment