Friday 23 January 2015

Beeruva Movie Review | Sundeep Kishan Beeruva Movie Review

బీరువా
 

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో వరుస హిట్ సినిమాలతో దూసుకొస్తున్న సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బీరువా'. సందీప్ కిషన్, సురభి జంటగా కన్మణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్, ఉషా కిరణ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఇపుడు చూద్దాం.
ప్లస్ పాయింట్స్:
సందీప్ కిషన్ నటనలో కొత్తదనం లేకపోయినప్పటికీ, సంజు పాత్రకు మాత్రం న్యాయం చేసాడు. డాన్సులు, ఫైట్లు బాగా చేసాడు. ఇక సురభి నటన పర్వాలేదు. నటన, గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. అనీషా సింగ్ పాత్ర తక్కువ నిడివే అయినప్పటికీ.. ఉన్నంతలో హాట్ గా కనిపించి అలరించింది. ఇక సీనియర్ నరేష్, సప్తగిరి, శంకర్ కామెడి ట్రాక్స్ సూపర్బ్. థియేటర్లో నవ్వులే నవ్వులు. వీరి కామెడి సీన్స్ తెగ నవ్విస్తాయి. ఇక మిగత నటీనటులు వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్:
కథలో ఎలాంటి కొత్తదనం లేదు. రెగ్యులర్ కథకే బీరువా అనే వస్తువుకు జోడించి, కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సినిమాలో వచ్చే తరువాతి సన్నివేశాన్ని ప్రేక్షకులు వెంటనే ఊహించేయవచ్చు. కథనంలో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. క్లైమాక్స్ సీన్ బాగా సాగదీశారు. రన్ టైం ఇంకాస్త తగ్గించి వుంటే బాగుండేది.
సాంకేతిక వర్గ పనితీరు:
సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చోటా విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేంను అందంగా చూపించాడు. ఇక తమన్ సంగీతం పర్వాలేదు. పాటలు బాగున్నాయి. ఎడిటర్ గౌతమ్ రాజు ఎడిటింగ్ లో మరింత కేర్ తీసుకొని ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. కత్తెరకు మరింత పనిచెప్పి వుంటే బాగుండేది.
వెలిగొండ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ పర్వాలేదు. ఇక దర్శకుడ్ కన్మణి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ విభాగాల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. పాతకథకే బీరువాను జతచేసి కొత్తగా చూపించాలని అనుకున్నాడు. కానీ అందులో కొత్తదనం ఏం కనిపించలేదు. ఇక ఉషా కిరణ్ ఫిలిమ్స్ – ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.
చివరగా:
బీరువా: ఒక్కసారి చూడవచ్చు

No comments:

Post a Comment